INDvsNZ 1st టెస్ట్ డే 2 రివ్యూ

బెంగ‌ళూరు టెస్ట్‌లో ఆట రెండో రోజు పూర్తిగా నిరాశ‌ప‌ర్చిన బ్యాట‌ర్లు, మూడో రోజు నిల‌క‌డ ప్ర‌ద‌ర్శించి నిల‌బ‌డ్డారు. 356ప‌రుగులు వెన‌క‌ప‌డి రెండో ఇన్నింగ్స్ మొద‌లుపెట్టిన ఇండియా, ఆట ముగిసే టైమ్‌కి రెండు వికెట్ల న‌ష్టానికి 3వికెట్ల న‌ష్టానికి 231 ప‌రుగులు చేసింది. డే 2 రివ్యూ మీ కోసం

తిట్టిన నోటితోనే..వాహ్‌, శ‌భాష్..స‌ర్ఫ‌రాజ్ ఖాన్

ఏది చేజారిన ద‌క్కుతుందెమో కానీ.. ఒక్క‌సారి మాట జారితే క‌ష్టం..! ఎందుకంటే తిట్టిన నోరే పొగ‌డాల్సిన‌ టైమ్ వ‌స్తుంది..! బెంగ‌ళూరు టెస్ట్ ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 46కే ఆలౌట్ అయింది. ఇండియాలోనే అతి త‌క్కువ స్కోరుకి ఆలౌట్ కావ‌డం.. ఓవ‌ర్‌కాస్ట్ కండీష‌న్ల‌లో బ్యాటింగ్ ఎంచుకోవ‌డం.. ఇవ‌న్నీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ను చిరాకు పెట్టాయ్‌. ఫీల్డ్‌లోనూ అదే ఫీలింగ్‌తో క‌నిపించాడు.

మ‌నోడే అనుకుంటే...మ‌డ‌తట్టేశాడు

మ‌నోడే క‌దా అని కాస్త ప‌క్క‌కి జ‌రిగితే, ప‌క్కంతా నాదే అన్నాడ‌ట‌. క్రికెట్‌లో ఇలాంటి సామెత‌లు, క‌రెంట్ జ‌న‌రేష‌న్ క్రికెట్‌కి బాగా సెట్ అవుతాయి. ఐపీఎల్ పేరుతో ఎంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫ‌యాన్స్‌కి ద‌క్కుతుందో, అదే స్థాయిలో విదేశీ ప్లేయ‌ర్స్‌కి మ‌న పిచ్‌ల‌పై అవ‌గాహ‌న‌తో పాటు, అల‌వాటైపోతున్నాయి. ఇప్పుడీలిస్ట్‌లో ర‌చిన్ ర‌వీంద్ర చేరిపోయాడు.

రెండో ఇన్నింగ్స్‌కి ముందే ఇండియాకి బిగ్ ఝ‌ల‌క్‌!

తొలి టెస్ట్‌, తొలి ఇన్నింగ్స్‌లో 46ప‌రుగుల‌కే ఆలౌటై నిరాశ‌ప‌ర్చిన ఇండియాకి, రెండో ఇన్నింగ్స్‌లోనూ క‌ష్టాలు త‌ప్పేలా లేవు. కివీస్ ప‌ట్టుబిగించిన ఈ మ్యాచ్‌లో, మ‌రోక బ్యాట‌ర్ లేకుండానే ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తుందా అనేది అంద‌రిని వెంటాడుతున్న ప్ర‌శ్న‌.

IND vs NZ తొలి టెస్ట్ DAY 1 రివ్యూ

బెంగ‌ళూరు టెస్ట్‌లో టీమిండియా డీలా ప‌డింది. న్యూజిలాండ్ పేస్ బౌల‌ర్ల ముందు బ్యాట‌ర్లంద‌రూ తేలిపోయారు. మ‌రీ, ఈ మ్యాచ్‌లో మ‌న బ్యాట‌ర్ల త‌ప్పిదాలున్నాయా, లేక కివీస్ పేస‌ర్ల టాలెంట్ మ్యాజికా అనేది ఫ్యాన్స్‌లో ఇప్పుడు త‌లెత్తిన ప్ర‌శ్న‌. మ‌రీ, ఇలాంటి టైమ్‌లో క్రికెట్ తెలుగు స్టోరీస్ రివ్యూ మీ కోసం

46ప‌రుగుల ఇన్నింగ్స్‌..కొన్ని చెత్త రికార్డ్‌లు

బంగ్లాదేశ్‌పై కాన్పూర్‌లో ఆడిన ఆట‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయితే, బెంగ‌ళూరులో గేమ్‌ప్లాన్‌తో పూర్తిగా డీలా ప‌డిపోయారు. కేవ‌లం 46ప‌రుగుల‌కే ఆలౌటై, టాప్ క్లాస్ బ్యాట‌ర్లైనా, పిచ్‌కి త‌గ్గ‌ట్టు బౌలింగ్ చేస్తే తిప్ప‌లు త‌ప్ప‌వ‌ని ఫ్రూవ్ చేశారు.

చిన్న‌స్వామిలో చిన్న‌బోయిన బ్యాట‌ర్లు - 46ర‌న్స్‌కే ఆలౌట‌య్యారు

బెంగ‌ళూరు చిన్న‌స్వామిలో, మ‌న బ్యాట‌ర్లు చిన్న‌బోయారు. టాపార్డ‌ర్ టాప్ లేచిపోతే, మిడిలార్డ‌ర్ మిడిల్‌క్లాస్ ఇన్నింగ్స్ కూడా ఆడ‌లేక‌, డ‌కౌటై, డ‌గౌట్‌కి క్యూ క‌ట్టారు. టాస్ గెల‌వ‌డం త‌ప్ప‌, ఫ‌స్టాఫ్‌లో ఇండియాకి పెద్ద‌గా ఏదీ క‌ల‌సిరాలేదు.

రెడ్‌బాల్ క్రికెట్‌లో రోహిత్ ఊరిస్తున్న రికార్డ్‌లు

న్యూజిలాండ్‌తో ప్రారంభ‌మ‌య్యే టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ స‌రికొత్త రికార్డ్‌లు బ్రేక్ చేయ‌నున్నాడు. ఇప్ప‌టికే టీట్వంటీ వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచి అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్న హిట్‌మ్యాన్‌, ఈ సిరీస్‌తో రెడ్‌బాల్ క్రికెట్‌లోనూ త‌న మార్క్ చూపించ‌నున్నాడు.

పాపం హ‌ర్షిత్ రానా...మ‌రీ ఇంత దుర‌దృష్ట‌మా!

ఈడెన్ గార్డెన్స్‌లో స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్‌కి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి ఫేమ‌స్ అయిన హ‌ర్షీత్ రానా గుర్తున్నాడా? రోహిత్ శ‌ర్మ అత‌న్ని ఇమిటేట్ చేస్తూ మ‌యాంక్‌ని ఆట‌ప‌ట్టించిన సీన్స్ ఇంకా క‌ళ్ల‌ముందే క‌దులుతున్నాయా? అయితే, మీకు హ‌ర్షిత్ రానా ఇంట్ర‌డ‌క్ష‌న్ అవ‌స‌రం లేదు. ఆ స్పీడ్ బౌల‌రే ఇప్పుడు అత్యంత దుర‌దృష్ట‌వంతుడు అనే ట్యాగ్‌లైన్‌కి ద‌గ్గ‌ర‌యిపోయాడు.

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ సిరీస్‌కి కెప్టెన్‌గా జ‌స్‌ప్రీత్‌ బుమ్రా!

ఆస్ట్రేలియాతో న‌వంబ‌ర్ చివ‌ర్లో జ‌ర‌గ‌బోయే సిరీస్‌కి టీమిండియా కొత్త కెప్టెన్‌తో బ‌రిలోకి దిగుతుందా..? రోహిత్ శ‌ర్మ ప్లేస్‌లో జ‌స్‌ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా మార‌నున్నాడా? అద్భుతం జ‌రిగితే త‌ప్ప‌, ఈ కెప్టెన్సీ మార్పు జ‌ర‌గ‌కుండా ఉంటుంద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి న‌మ్మ‌డానికి క‌ష్టంగా ఉన్నా, ఇదే నిజం.

ఎన్నాళ్లో వేచిన ఉద‌యం....

ఎన్నాళ్లో వేచిన ఉద‌యం.... ఈ రోజే ఎదుర‌వుతుంటే ఇప్పుడు ఈ పాటే పాడుకుంటూ ఫుల్ జోష్‌లో ఉన్నాడు సంజూ శాంస‌న్‌. ఉప్ప‌ల్ స్టేడియంలో అద్భుత‌మైన సెంచ‌రీతో స‌త్తాచాటిన సంజూ, కోచ్‌, కెప్టెన్‌కి స్పెష‌ల్ థ్యాంక్స్ చెప్ప‌డ‌మే కాదు, ఈ అవ‌కాశం కోసం చాలా కాలంగా ఎదురుచూస్త‌న్న‌ట్టు చెప్పాడు.

హైద‌రాబాద్ ఫైట్‌కి మార్పుల‌తో ఇండియా

హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌బోయే టీట్వంటీ మ్యాచ్‌లో రిజ‌ర్వ్ బెంచ్‌ని టెస్ట్ చేసేందుకు క‌స‌ర‌త్తులు చేస్తోంది సూర్య కుమార్ & కో. ఈ సిరీస్‌లో ఇప్ప‌టికే, తెలుగోడు నితీశ్ కుమార్ రెడ్డి, మ‌యాంక్ యాద‌వ్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి, రాబోయే ఐపీఎల్ మెగా ఆక్ష‌న్‌లో రేట్లు పెంచేసుకున్నారు. వాళ్ల‌తో పాటే మ‌రికొంత‌మంది యంగ్‌స్ట‌ర్స్ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నారు.