`

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ సిరీస్‌కి కెప్టెన్‌గా జ‌స్‌ప్రీత్‌ బుమ్రా!

ఆస్ట్రేలియాతో న‌వంబ‌ర్ చివ‌ర్లో జ‌ర‌గ‌బోయే సిరీస్‌కి టీమిండియా కొత్త కెప్టెన్‌తో బ‌రిలోకి దిగుతుందా..? రోహిత్ శ‌ర్మ ప్లేస్‌లో జ‌స్‌ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా మార‌నున్నాడా? అద్భుతం జ‌రిగితే త‌ప్ప‌, ఈ కెప్టెన్సీ మార్పు జ‌ర‌గ‌కుండా ఉంటుంద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి న‌మ్మ‌డానికి క‌ష్టంగా ఉన్నా, ఇదే నిజం.

��్ర‌స్తుతం న్యూజిలాండ్‌తో సిరీస్‌కి సిద్ధ‌మ‌వుతున్న టీమిండియా, ఈ సిరీస్ రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌బోయే బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ సిరీస్‌కి కెప్టెన్సీని మార్చ‌నున్నారు. రీసెంట్ టైమ్‌లో 8వ వండ‌ర్‌గా అంద‌రిచేత ప్ర‌శంస‌లు అందుకున్న జ‌స్‌ప్రీత్ బుమ్రాను కెప్టెన్‌గా ఫైన‌ల్ చేయ‌నున్నారు. దానికి బ‌లం చేకూర్చుతూ, ప్ర‌స్తుత న్యూజిలాండ్ సిరీస్‌కు బుమ్రాని వైస్ కెప్టెన్‌గా నియ‌మించారు. గ‌తంలో ఇంగ్లండ్‌తో జ‌రిగిన ఓ మ్యాచ్‌కి బుమ్రా కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. అయితే, ఈ సడెన్ మార్పు ఎందుకు అంటారా? రోహిత్ శ‌ర్మ వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో తొలి రెండు టెస్ట్‌ల‌కు జ‌ట్టుకి అందుబాటులో ఉండ‌టం లేదు. న‌వంబ‌ర్ 22న పెర్త్‌లో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌తో పాటు అడిలైడ్ మ్యాచ్‌కి కూడా అత‌ను టీమ్‌కి దూరంగానే ఉండ‌నున్నాడు. దీంతో బుమ్రాకి కెప్టెన్సీ అప్ప‌జెప్ప‌నుంద‌ని బీసీసీఐ మెంబ‌ర్ ఒక‌రు చెప్పారు. టెస్ట్‌ల్లో రోహిత్ లాంటి సీనియ‌ర్ ప్లేయ‌ర్ లేకుండా టీమ్‌ని లీడ్ చేయ‌డం బుమ్రాకి అంత ఈజీ టాస్క్ ఏం కాదు, కానీ, ఇక్క‌డ స‌క్సెస్ అయితే మాత్రం ఫ్యూచ‌ర్‌లో రెడ్ బాల్ క్రికెట్‌లో బుమ్రా, రోహిత్ వార‌సుడిగా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *