పాపం హ‌ర్షిత్ రానా...మ‌రీ ఇంత దుర‌దృష్ట‌మా!

ఈడెన్ గార్డెన్స్‌లో స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్‌కి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి ఫేమ‌స్ అయిన హ‌ర్షీత్ రానా గుర్తున్నాడా? రోహిత్ శ‌ర్మ అత‌న్ని ఇమిటేట్ చేస్తూ మ‌యాంక్‌ని ఆట‌ప‌ట్టించిన సీన్స్ ఇంకా క‌ళ్ల‌ముందే క‌దులుతున్నాయా? అయితే, మీకు హ‌ర్షిత్ రానా ఇంట్ర‌డ‌క్ష‌న్ అవ‌స‌రం లేదు. ఆ స్పీడ్ బౌల‌రే ఇప్పుడు అత్యంత దుర‌దృష్ట‌వంతుడు అనే ట్యాగ్‌లైన్‌కి ద‌గ్గ‌ర‌యిపోయాడు.

ఎన్నాళ్లో వేచిన ఉద‌యం....

ఎన్నాళ్లో వేచిన ఉద‌యం.... ఈ రోజే ఎదుర‌వుతుంటే ఇప్పుడు ఈ పాటే పాడుకుంటూ ఫుల్ జోష్‌లో ఉన్నాడు సంజూ శాంస‌న్‌. ఉప్ప‌ల్ స్టేడియంలో అద్భుత‌మైన సెంచ‌రీతో స‌త్తాచాటిన సంజూ, కోచ్‌, కెప్టెన్‌కి స్పెష‌ల్ థ్యాంక్స్ చెప్ప‌డ‌మే కాదు, ఈ అవ‌కాశం కోసం చాలా కాలంగా ఎదురుచూస్త‌న్న‌ట్టు చెప్పాడు.

హైద‌రాబాద్ ఫైట్‌కి మార్పుల‌తో ఇండియా

హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌బోయే టీట్వంటీ మ్యాచ్‌లో రిజ‌ర్వ్ బెంచ్‌ని టెస్ట్ చేసేందుకు క‌స‌ర‌త్తులు చేస్తోంది సూర్య కుమార్ & కో. ఈ సిరీస్‌లో ఇప్ప‌టికే, తెలుగోడు నితీశ్ కుమార్ రెడ్డి, మ‌యాంక్ యాద‌వ్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి, రాబోయే ఐపీఎల్ మెగా ఆక్ష‌న్‌లో రేట్లు పెంచేసుకున్నారు. వాళ్ల‌తో పాటే మ‌రికొంత‌మంది యంగ్‌స్ట‌ర్స్ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నారు.

దేశ రాజ‌ధానిలో తెలుగోడి ధూమ్‌ధామ్‌

దేశ రాజ‌ధానిలో ధూమ్‌ధామ్ ఆడేశాడు తెలుగోడు. గ‌ల్లీ స్థాయి నుంచి ఢిల్లీ రేంజ్‌కి ఎద‌గ‌డ‌మే కాదు...కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అనే స్ట‌యిల్లో ఆటాడేసుకున్నాడు. స్లో గా వేసినా, వేగంగా విసిరినా....టార్గెట్ బౌండ‌రీలైన్ అన్న‌ట్టు బాదేశాడు. స‌న్న‌గా క‌రెంట్ తీగ‌లా సాఫ్ట్‌గా క‌నిపిస్తూనే, బ్యాట్ ప‌డితే ఎంత వైలైంటో ఫ్యాన్స్‌కి మ‌రోసారి చూపేట్టేశాడు.