`
హైద‌రాబాద్ ఫైట్‌కి మార్పుల‌తో ఇండియా

హైద‌రాబాద్ ఫైట్‌కి మార్పుల‌తో ఇండియా

హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌బోయే టీట్వంటీ మ్యాచ్‌లో రిజ‌ర్వ్ బెంచ్‌ని టెస్ట్ చేసేందుకు క‌స‌ర‌త్తులు చేస్తోంది సూర్య కుమార్ & కో. ఈ సిరీస్‌లో ఇప్ప‌టికే, తెలుగోడు నితీశ్ కుమార్ రెడ్డి, మ‌యాంక్ యాద‌వ్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి, రాబోయే ఐపీఎల్ మెగా ఆక్ష‌న్‌లో రేట్లు పెంచేసుకున్నారు. వాళ్ల‌తో పాటే మ‌రికొంత‌మంది యంగ్‌స్ట‌ర్స్ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నారు.

1 2వ తేదీన జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌లో ముగ్గురు ప్లేయ‌ర్లు జ‌ట్టులోకి వ‌చ్చే చాన్స్ క‌నిపిస్తోంది. ఇందులో హైద‌రాబాదీ రంజీ టీమ్ కెప్టెన్ తిల‌క్ వ‌ర్మ పేరు ఎక్కువ‌గా వినిపిస్తోంది. ఇప్ప‌టికే 16 అంత‌ర్జాతీయ టీట్వంటీలు ఆడిన తిల‌క్ కెరీర్‌లో రెండు అర్థ‌సెంచ‌రీలున్నాయి. ఉప్ప‌ల్ వికెట్‌పై సులువుగా ప‌రుగులు రాబ‌ట్టేస్తున్నాడు. లాస్ట్ సీజ‌న్ ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్‌పై అద‌ర‌గొట్టాడు. తిల‌క్ వ‌ర్మ‌తో పాటు హ‌ర్షిత్ రానా, ధృవ్ జురెల్ కూడా టీమ్‌లోకి వ‌చ్చే చాన్స్ క‌నిపిస్తోంది. సంజూ రెండు టీట్వంటీల్లో పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. దీంతో ధృవ్ జురెల్‌కి లైన్ క్లియ‌ర్ అయ్యింది. అర్ష‌దీప్ టెస్ట్ టీమ్‌లోకి లైన్ క్లియ‌ర్ కావ‌డంతో, అత‌ని ప్లేస్‌లో హ‌ర్షిత్‌కి చాన్స్ ద‌క్క‌నుంది. సుంద‌ర్ ప్లేస్‌లో తిల‌క్ టీమ్‌లోకి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *