
మనోడే అనుకుంటే...మడతట్టేశాడు
మనోడే కదా అని కాస్త పక్కకి జరిగితే, పక్కంతా నాదే అన్నాడట. క్రికెట్‌లో ఇలాంటి సామెతలు, కరెంట్ జనరేషన్ క్రికెట్‌కి బాగా సెట్ అవుతాయి. ఐపీఎల్ పేరుతో ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ ఫయాన్స్‌కి దక్కుతుందో, అదే స్థాయిలో విదేశీ ప్లేయర్స్‌కి మన పిచ్‌లపై అవగాహనతో పాటు, అలవాటైపోతున్నాయి. ఇప్పుడీలిస్ట్‌లో రచిన్ రవీంద్ర చేరిపోయాడు.
� ��చిన్ రవీంద్ర, సచిన్‌లో చిన్, రాహుల్‌లో ర కలిసి రచిన్‌గా పేరు పెట్టుకున్న ఈ కుర్రాడి స్వస్థలం బెంగళూరు. చాలా ఏళ్ల కిందటే ఫ్యామిలీ కివీస్‌కి షిఫ్ట్ అయ్యింది. 2021 వరకు రచిన్ పెద్దగా ఎవరికి తెలియదు. ఆ ఏడాది జాతీయ జట్టులోకి వచ్చిన రవీంద్ర, కాన్పూర్‌లో అశ్విన్, జడేజా, అక్షర్‌లాంటి స్పిన్‌త్రయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని మ్యాచ్ డ్రాగా ముగియడంలో కీ రోల్ ప్లే చేశాడు. ఇక ఇండియాలో 2023లో జరిగిన వరల్డ్‌కప్‌లో రచిన్ వరుస సెంచరీలతో సత్తాచాటాడు. ఈ ప్రపంచ కప్‌లో రచిన్ 10 ఇన్నింగ్స్‌లో 578 రన్స్ చేశాడు. సగటు 64.22. రచిన్ ఆడిన ఆట వేలం పాటు మంచి ధర పలికంచడమే కాదు, చెన్నై సూపర్ కింగ్స్‌తో జర్నీ చేసేలా అవకాశమిచ్చింది. ఇండియాతో టెస్ట్ మ్యాచ్‌లో కీ టైమ్‌లో వికెట్ కాపాడుకోవడమే కాదు, సెంచరీతో సత్తాచాటాడు. 2012 తర్వాత కివీస్ బౌలర్ శతకం సాధించడం ఇదే తొలిసారి. బౌలింగ్‌తోనూ ఈ ప్లేయర్ ఆకట్టుకోగలడు. వరల్డ్‌కప్‌లో ఆడినప్పుడు మనోడే అని అభినందించిన నోళ్లే, ఇప్పుడేంటి ఇలా ఆడుతున్నాడని విసుక్కున్నారు. మొత్తంగా ఈ ఇన్నింగ్స్ కివీస్‌ని టాప్‌లో నిలిపేసింద
Leave a comment
Your email address will not be published. Required fields are marked *