పాపం హర్షిత్ రానా...మరీ ఇంత దురదృష్టమా!
ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్‌కి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి ఫేమస్ అయిన హర్షీత్ రానా గుర్తున్నాడా? రోహిత్ శర్మ అతన్ని ఇమిటేట్ చేస్తూ మయాంక్‌ని ఆటపట్టించిన సీన్స్ ఇంకా కళ్లముందే కదులుతున్నాయా? అయితే, మీకు హర్షిత్ రానా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆ స్పీడ్ బౌలరే ఇప్పుడు అత్యంత దురదృష్టవంతుడు అనే ట్యాగ్‌లైన్‌కి దగ్గరయిపోయాడు.
� ��ాస్ట్ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కి ఆడిన హార్షిత్ రానా, తనదైన టాలెంట్‌తో ఆకట్టుకున్నాడు. ఆ టైమ్‌లో గంభీర్ ఆ టీమ్‌కి మెంటార్‌గా ఉన్నాడు, అతను టీమిండియా హెడ్‌కోచ్‌గా మారాకా, హార్షిత్ రానాని శ్రీలంక, జింబాబ్వే సిరీస్‌లకు ఎంపిక చేశాడు. అయితే, ప్లేయింగ్ ఎలెవన్‌లో చాన్స్ మాత్రం రాలేదు. కానీ, అనుహ్యంగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌కి కూడా సెలెక్ట్ చేసి గంభీర్, ఈ యంగ్‌స్టర్‌కి ఫ్యూచర్ ఇవ్వాలనుకున్నాడు. కట్ చేస్తే, అంతా ప్లాన్ ప్రకారమే జరిగినా, వైరల్ ఫీవర్ రానాని ఇరకాటంలో పడేసింది. ఉప్పల్‌లో అరంగేట్రం చేసి, రాబోయే ఆక్షన్‌లో కోట్లు తన ఖాతాలో వేసుకోవాలనుకుంటే, ఫీవర్ రానాని హోటల్ రూమ్‌కే పరిమితం చేసింది. ఫలితంగా ఆన్‌క్యాప్డ్ ప్లేయర్‌గానే మిగిలిపోయాడు. క్యాప్డ్ అనే ట్యాగ్‌లైన్ వచ్చి ఉంటే రానాకి కోట్లు వచ్చేది. ఇప్పుడు కేకేఆర్ రీటైన్ చేసుకుంటుందో, చేస్తే 4 కోట్లు, ఆక్షన్‌లోకి వెళ్తే ఎంత దక్కుతుందనే దానిపై క్లారిటీ లేదు. దీంతో అందరూ అయ్యో పాపం రానా అనుకుంటూ ఓదార్పు మేసేస్‌లు పెడుతున్నారు.
Leave a comment
Your email address will not be published. Required fields are marked *