
రెండో ఇన్నింగ్స్‌కి ముందే ఇండియాకి బిగ్ ఝలక్!
తొలి టెస్ట్, తొలి ఇన్నింగ్స్‌లో 46పరుగులకే ఆలౌటై నిరాశపర్చిన ఇండియాకి, రెండో ఇన్నింగ్స్‌లోనూ కష్టాలు తప్పేలా లేవు. కివీస్ పట్టుబిగించిన ఈ మ్యాచ్‌లో, మరోక బ్యాటర్ లేకుండానే ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తుందా అనేది అందరిని వెంటాడుతున్న ప్రశ్న.
� ��ెండో రోజు, జడేజా బౌలింగ్‌లో బాల్‌ను అందుకునే క్రమంలో రిషబ్ పంత్ మోకాలికి దెబ్బ తగిలింది. గతంలో ఆపరేషన్ జరిగిన చోటే బాల్ తాకడంతో, మైదానంలోనే పంత్ విలవిలలాడిపోయాడు. మెడికల్ స్టాఫ్ చాలాసేపు ట్రీట్‌మెంట్ ఇచ్చినా, పంత్ ఫీల్డ్‌ని వీడటం, స్కానింగ్ కాస్త కలవరపెట్టేలా ఉండటంతో మూడోరోజు వికెట్‌కి పంత్ రాలేదు. అతని స్థానంలో ధృవ్ జురేల్ ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 46రన్స్‌లో 20 పరుగులు పంతే చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అతను చాలా కీ. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న పంత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం చాలా అవసరం. మరోవైపు, ఆస్త్రేలియా సిరీస్‌లో పంత్ ప్రాముఖ్యత గురించి చెప్పాల్సినవసరం లేదు. మరీ, ఇలాంటి టైమ్‌లో పంత్ ఫిట్‌నెస్ గురించి ఫిజియో ఏం చెప్తారనేది ఆసక్తికరం.
Leave a comment
Your email address will not be published. Required fields are marked *