`

ఎన్నాళ్లో వేచిన ఉద‌యం....

ఎన్నాళ్లో వేచిన ఉద‌యం.... ఈ రోజే ఎదుర‌వుతుంటే ఇప్పుడు ఈ పాటే పాడుకుంటూ ఫుల్ జోష్‌లో ఉన్నాడు సంజూ శాంస‌న్‌. ఉప్ప‌ల్ స్టేడియంలో అద్భుత‌మైన సెంచ‌రీతో స‌త్తాచాటిన సంజూ, కోచ్‌, కెప్టెన్‌కి స్పెష‌ల్ థ్యాంక్స్ చెప్ప‌డ‌మే కాదు, ఈ అవ‌కాశం కోసం చాలా కాలంగా ఎదురుచూస్త‌న్న‌ట్టు చెప్పాడు.

ఈ మ్యాచ్‌లో 47 బాల్స్‌లో 236 స్ట్ర‌యిక్ రేట్‌తో 11ఫోర్లు, 8సిక్స‌ర్ల‌తో 111 ప‌రుగులతో విధ్వంసం సృష్టించాడు. అంతేకాదు, ఈ ఇన్నింగ్స్‌తో జ‌ట్టులో అత‌ని ప్లేస్ ప‌ర్మినెంట్ అనే కామెంట్‌కి ద‌గ్గ‌ర చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో శాంస‌న్‌, వ‌రుస‌గా 5 సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు. దీని వెనుక పెద్ద క‌థే ఉంది. శాంస‌న్ మెంటార్ బీజూ జార్జ్‌, ఒక సంద‌ర్భంలో నువ్వు ఒకే ఓవ‌ర్‌లో ఐదు సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డితే చూడాల‌ని ఉంద‌న్నాడ‌ట‌. ఏడాదిగా ఈ ఫీట్‌కోసం ప్ర‌య‌త్నిస్తున్న సంజూ, ఈ మ్యాచ్‌తో త‌న మెంటార్ కోరిక తీర్చ‌డ‌మే కాదు, గంభీర్ త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్నాడు. ఏదైనా ఉప్ప‌ల్ సంజూ ఇన్నింగ్స్ ద‌స‌రా రోజే దీపావ‌ళిని గుర్తుచేసింది.

Krishna Veni

Leave a comment

Your email address will not be published. Required fields are marked *