తిట్టిన నోటితోనే..వాహ్, శభాష్..సర్ఫరాజ్ ఖాన్
ఏది చేజారిన దక్కుతుందెమో కానీ.. ఒక్కసారి మాట జారితే కష్టం..! ఎందుకంటే తిట్టిన నోరే పొగడాల్సిన టైమ్ వస్తుంది..! బెంగళూరు టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 46కే ఆలౌట్ అయింది. ఇండియాలోనే అతి తక్కువ స్కోరుకి ఆలౌట్ కావడం.. ఓవర్‌కాస్ట్ కండీషన్లలో బ్యాటింగ్ ఎంచుకోవడం.. ఇవన్నీ కెప్టెన్ రోహిత్ శర్మను చిరాకు పెట్టాయ్. ఫీల్డ్‌లోనూ అదే ఫీలింగ్‌తో కనిపించాడు.
� ��దే సమయంలో ఫీల్డింగ్ తప్పిదం చేసిన సర్ఫరాజ్‌పై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కేశాడు. ఇక రోహిత్ శర్మ నోటి నుంచి వచ్చే సుభాషితాలు అందరికీ తెలిసిందేగా..! అలాగే సర్ఫరాజ్‌ను ఎడాపెడా తిట్టేశాడు. కానీ 24 గంటలు గడవకముందే సీన్ రివర్స్ అయింది. ఇండియా 350కి పైగా లోటుతో బ్యాటింగ్ దిగింది. రోహిత్‌తో పాటు జైశ్వాల్ ఔటైన టైమ్‌లో సర్ఫరాజ్ దుమ్మురేపాడు. హాఫ్ సెంచరీతో ఇరగదీశాడు. సిక్సర్లు, ఫోర్లతో కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఆ ఇన్నింగ్స్ చూశాకా.. ఎవరైనా సరే వారెవ్వా అనాల్సిందే..! మరి మన హిట్‌మ్యాన్ ముఖచిత్రమెలా ఉంటుంది. అలాంటి ఇన్నింగ్స్‌కి కెప్టెన్‌గా రోహిత్ కూడా పొగడాల్సిందే కదా..! అప్పుడు తిట్టేసి.. ఇప్పుడు తిరగేస్తే ఎలా..? ఇదంతా చూసి.. వాట్ ఈజ్ దిస్ రోహిత్ అంటూ ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోహిత్ తీరే అది..! అటు కుర్రాళ్లు కూడా రోహిత్ ఏదైనా అన్నా పెద్దగా పట్టించుకోరు..! బడేభాయ్ అంటూ వెనకేసుకొస్తారు..! ఇదంతా వదిలేస్తే.. సర్ఫరాజ్ ఇన్నింగ్స్‌కి మాత్రం సలాం కొట్టాల్సిందే.
Leave a comment
Your email address will not be published. Required fields are marked *