
చిన్నస్వామిలో చిన్నబోయిన బ్యాటర్లు - 46రన్స్‌కే ఆలౌటయ్యారు
బెంగళూరు చిన్నస్వామిలో, మన బ్యాటర్లు చిన్నబోయారు. టాపార్డర్ టాప్ లేచిపోతే, మిడిలార్డర్ మిడిల్‌క్లాస్ ఇన్నింగ్స్ కూడా ఆడలేక, డకౌటై, డగౌట్‌కి క్యూ కట్టారు. టాస్ గెలవడం తప్ప, ఫస్టాఫ్‌లో ఇండియాకి పెద్దగా ఏదీ కలసిరాలేదు.
ఇండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఓపెనర్ జోడీ రోహిత్ శర్మ, యశస్వీ జైశ్వాల్‌ను కివీస్ బౌలర్లు ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా రోహిత్‌ను, అటు హెన్రీ, ఇటు సౌథీ క్రీజులో కుదురుకోనీయలేదు. దీంతో, రోహిత్ సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత, వచ్చిన కింగ్ కోహ్లీ జీరోకే ఔటయ్యాడు. అతని ఎంట్రీలో ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో కేరింతలతో వెల్‌కమ్ చెప్పారు, కానీ కోహ్లీ సున్నాకే ఔటవ్వడం నిరాశపర్చింది.
ఇండియా ఇన్నింగ్స్‌లో కీలక బ్యాటర్లైన కోహ్లీతో పాటు, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా , అశ్విన్ డకౌట్‌గా వెనుదిరిగారు. కివీస్ బౌలర్ల దెబ్బకి ఇండియా కేవలం 46రన్స్‌కే ఆలౌటయ్యారు. భారత క్రికెట్ హిస్టరీలో ఇండియాకిది మూడవ అత్యల్ప స్కోర్. స్వదేశంలో ఇదే చెత్త స్కోర్, ఇది ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపర్చడమే కాదు, టీమిండియాను కూడా ఇరకాటంలో పడేసింది.
Leave a comment
Your email address will not be published. Required fields are marked *