
INDvsNZ 1st టెస్ట్ డే 2 రివ్యూ
బెంగళూరు టెస్ట్‌లో ఆట రెండో రోజు పూర్తిగా నిరాశపర్చిన బ్యాటర్లు, మూడో రోజు నిలకడ ప్రదర్శించి నిలబడ్డారు. 356పరుగులు వెనకపడి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా, ఆట ముగిసే టైమ్‌కి రెండు వికెట్ల నష్టానికి 3వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. డే 2 రివ్యూ మీ కోసం
1 . జడేజా మ్యాజిక్‌తో కివీస్ 4వికెట్లు త్వరగా చేజార్చుకుంది 2. 8వ వికెట్‌కి రచిన్ రవీంద్ర, టీమ్ సౌథీ 137 రన్స్ భాగస్వామ్యం 3. అర్థసెంచరీతో టీమ్‌కి అదిరే ఆరంభాన్నిచ్చిన రోహిత్ శర్మ 4. కష్టసమయంలో జట్టును ఆదుకున్న కోహ్లీ & సర్ఫరాజ్ 5. 3వ వికెట్‌కు 136పరుగులు జోడీంచిన విరాట్ కోహ్లీ & సర్ఫరాజ్ 6. డే చివరి బాల్‌కి విరాట్ కోహ్లీ ఔట్ 7. రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా 5రన్‌రేట్‌తో పరుగులు సాధించింది 8. ఈ మ్యాచ్‌లో ఒకే రోజు 453 పరుగులు నమోదు. రెండో అత్యుత్తమ జట్టు స్కోర్ ఇది. ప్రస్తుతం 125పరుగులు వెనకబడి ఉన్న ఇండియా, నాల్గో రోజు బ్యాటింగ్ ఎలా చేస్తుందనేది ఆసక్తికరం. అదే టైమ్‌లో పంత్ ఫిట్‌గా ఉండటం, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అశ్విన్ లాంటి స్టార్ ప్లేయర్స్ ఉండటం, వాళ్లు దూకుడిగా ఆడితే, ఈ మ్యాచ్‌లో ఇండియా గెలవడం గ్యారెంటీగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ వికెట్‌పై నాల్గో ఇన్నింగ్స్ ఆడటం అంత ఈజీ కాదు.
Leave a comment
Your email address will not be published. Required fields are marked *