రోహిత్ శ‌ర్మ‌కు ఆర్సీబీ 20 కోట్లు ఇస్తే..???

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ‌, ఆక్ష‌న్‌లోకి వ‌స్తాడా రాడా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. హార్థిక్ పాండ్య‌కి కెప్టెన్సీ ఇచ్చి, రోహిత్‌ని అవ‌మాన ప‌ర్చార‌ని అత‌ని ఫ్యాన్స్ లాస్ట్ సీజ‌న్‌లో ముంబై ఆడిన చాలా మ్యాచ్‌ల్లో ఓపెన్‌గానే చెప్పారు. హార్థిక్ ఆన్ ద ఫీల్డ్‌లో క‌నిపించిన ప్ర‌తిసారి వాళ్లు అదే తీరును ప్ర‌ద‌ర్శిస్తూ, రోహిత్‌పై మ‌మ‌కారాన్ని చాటుకున్నారు.

ముంబై ఇండియ‌న్స్ లో మిగిలేది వాళ్లేనా..?

రిటెన్ష‌న్‌కి టైమ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది ఫ్రాంచైజీల త‌మ వ్యూహల‌కి ప‌దును పెడుతున్నాయి. ఈ లిస్ట్‌లో ముంబై ఇండియ‌న్స్ రిటెన్ష‌న్ ప్లేయ‌ర్స్ ఎవ‌రు అనేది ఆస‌క్తిని పెంచుతోంది. రిటెన్ష‌న్ ఫైన‌ల్ డేట్‌కి మూడు వారాల ముందు హెడ్‌కోచ్‌ని మార్చేసింది. మార్క్ బౌచ‌ర్ ప్లేస్‌లో మ‌హేల జ‌య‌వ‌ర్థ‌నే పేరును ప్ర‌క‌టించి అంద‌రిని ఆశ్చ‌ర్యంలో ముంచేసింది.

పాపం హ‌ర్షిత్ రానా...మ‌రీ ఇంత దుర‌దృష్ట‌మా!

ఈడెన్ గార్డెన్స్‌లో స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్‌కి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి ఫేమ‌స్ అయిన హ‌ర్షీత్ రానా గుర్తున్నాడా? రోహిత్ శ‌ర్మ అత‌న్ని ఇమిటేట్ చేస్తూ మ‌యాంక్‌ని ఆట‌ప‌ట్టించిన సీన్స్ ఇంకా క‌ళ్ల‌ముందే క‌దులుతున్నాయా? అయితే, మీకు హ‌ర్షిత్ రానా ఇంట్ర‌డ‌క్ష‌న్ అవ‌స‌రం లేదు. ఆ స్పీడ్ బౌల‌రే ఇప్పుడు అత్యంత దుర‌దృష్ట‌వంతుడు అనే ట్యాగ్‌లైన్‌కి ద‌గ్గ‌ర‌యిపోయాడు.

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ సిరీస్‌కి కెప్టెన్‌గా జ‌స్‌ప్రీత్‌ బుమ్రా!

ఆస్ట్రేలియాతో న‌వంబ‌ర్ చివ‌ర్లో జ‌ర‌గ‌బోయే సిరీస్‌కి టీమిండియా కొత్త కెప్టెన్‌తో బ‌రిలోకి దిగుతుందా..? రోహిత్ శ‌ర్మ ప్లేస్‌లో జ‌స్‌ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా మార‌నున్నాడా? అద్భుతం జ‌రిగితే త‌ప్ప‌, ఈ కెప్టెన్సీ మార్పు జ‌ర‌గ‌కుండా ఉంటుంద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి న‌మ్మ‌డానికి క‌ష్టంగా ఉన్నా, ఇదే నిజం.

ఎన్నాళ్లో వేచిన ఉద‌యం....

ఎన్నాళ్లో వేచిన ఉద‌యం.... ఈ రోజే ఎదుర‌వుతుంటే ఇప్పుడు ఈ పాటే పాడుకుంటూ ఫుల్ జోష్‌లో ఉన్నాడు సంజూ శాంస‌న్‌. ఉప్ప‌ల్ స్టేడియంలో అద్భుత‌మైన సెంచ‌రీతో స‌త్తాచాటిన సంజూ, కోచ్‌, కెప్టెన్‌కి స్పెష‌ల్ థ్యాంక్స్ చెప్ప‌డ‌మే కాదు, ఈ అవ‌కాశం కోసం చాలా కాలంగా ఎదురుచూస్త‌న్న‌ట్టు చెప్పాడు.

హైద‌రాబాద్ ఫైట్‌కి మార్పుల‌తో ఇండియా

హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌బోయే టీట్వంటీ మ్యాచ్‌లో రిజ‌ర్వ్ బెంచ్‌ని టెస్ట్ చేసేందుకు క‌స‌ర‌త్తులు చేస్తోంది సూర్య కుమార్ & కో. ఈ సిరీస్‌లో ఇప్ప‌టికే, తెలుగోడు నితీశ్ కుమార్ రెడ్డి, మ‌యాంక్ యాద‌వ్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి, రాబోయే ఐపీఎల్ మెగా ఆక్ష‌న్‌లో రేట్లు పెంచేసుకున్నారు. వాళ్ల‌తో పాటే మ‌రికొంత‌మంది యంగ్‌స్ట‌ర్స్ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నారు.

RCB రిటెన్ష‌న్ లిస్ట్‌లో వీళ్ల‌కి నో ఛాన్స్‌?

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ మెగా ఆక్ష‌న్‌కి కౌంట్‌డౌన్ మొద‌ల‌య్యింది. అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు జ‌ట్లు త‌మ రిటెన్ష‌న్ లిస్ట్‌ని రిలీజ్ చేయాల‌ని గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి టైమ్‌లో, ఫ్రాంచైజీలు ఎలాంటి లిస్ట్‌తో వ‌స్తాయ‌ని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ టీమ్‌ల‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ప్లేయ‌ర్ల‌లో ఎవ‌రు ఉంటార‌నేది ఆస‌క్తిని పెంచేస్తుంది.

దేశ రాజ‌ధానిలో తెలుగోడి ధూమ్‌ధామ్‌

దేశ రాజ‌ధానిలో ధూమ్‌ధామ్ ఆడేశాడు తెలుగోడు. గ‌ల్లీ స్థాయి నుంచి ఢిల్లీ రేంజ్‌కి ఎద‌గ‌డ‌మే కాదు...కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అనే స్ట‌యిల్లో ఆటాడేసుకున్నాడు. స్లో గా వేసినా, వేగంగా విసిరినా....టార్గెట్ బౌండ‌రీలైన్ అన్న‌ట్టు బాదేశాడు. స‌న్న‌గా క‌రెంట్ తీగ‌లా సాఫ్ట్‌గా క‌నిపిస్తూనే, బ్యాట్ ప‌డితే ఎంత వైలైంటో ఫ్యాన్స్‌కి మ‌రోసారి చూపేట్టేశాడు.

IPL 2025: PBKS retained players పూర్తి జాబితా | IPL Retention 2025

ఈ వీడియోలో, 2025 IPLకి సంబంధించి పంజాబ్ కింగ్స్ (PBKS) retained players యొక్క పూర్తి జాబితాను పరిశీలిస్తాం. ఈసారి మీ అభిమాన ఆటగాళ్లు retained అయినారా లేదా తెలుసుకోండి! అన్ని తాజా సమాచారం మరియు విశ్లేషణలు ఇక్కడ చూడండి.