ముంబై ఇండియన్స్ లో మిగిలేది వాళ్లేనా..?
రిటెన్షన్‌కి టైమ్ దగ్గర పడుతున్న కొద్ది ఫ్రాంచైజీల తమ వ్యూహలకి పదును పెడుతున్నాయి. ఈ లిస్ట్‌లో ముంబై ఇండియన్స్ రిటెన్షన్ ప్లేయర్స్ ఎవరు అనేది ఆసక్తిని పెంచుతోంది. రిటెన్షన్ ఫైనల్ డేట్‌కి మూడు వారాల ముందు హెడ్‌కోచ్‌ని మార్చేసింది. మార్క్ బౌచర్ ప్లేస్‌లో మహేల జయవర్థనే పేరును ప్రకటించి అందరిని ఆశ్చర్యంలో ముంచేసింది.
� ��లాగే వాళ్లు అంటిపెట్టుకునే ప్లేయర్ల గురించి హాట్ హాట్‌గా డిస్కషన్ జరుగుతోంది. ఈ లిస్ట్‌లో రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, బుమ్రాలను రిటెన్షన్ చేసుకోవడం గ్యారెంటీగా కనిపిస్తోంది. ఇక, ఐదో ప్లేస్‌లో ఇషాన్ కిషన్ లేదా తిలక్ వర్మకు చాన్స్ దక్కనుంది. ఇక అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా నెహాల్ వధేరా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ లిస్ట్‌ని ఇలాగే కొనసాగిస్తే, 79 కోట్లు రిటెన్షన్ కోసమే ముంబై ఖర్చు చేసినట్టు. మిగిలిన 41 కోట్లతో ఫ్రాంచైజీ మిగిలిన టీమ్‌ను ఆక్షన్‌లో దక్కించుకోవాలి. ప్రస్తుతానికి ఈ లెక్కలు అన్నీ ఉహగానాలుగా ఉన్నా, టాప్ ఫోర్ ప్లేయర్లలో ఎవరిని వదులుకునే ధైర్యం ముంబై చేయదు. ఇలాంటి టైమ్‌లో అక్టోబర్ 31న ఎవరి పేర్లు వాళ్ల లిస్ట్‌లో ఉంటాయనేది ఆసక్తికరం.*
Leave a comment
Your email address will not be published. Required fields are marked *