దేశ రాజధానిలో ధూమ్‌ధామ్ ఆడేశాడు తెలుగోడు. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ రేంజ్‌కి ఎదగడమే కాదు...కొడితే
కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అనే స్టయిల్లో ఆటాడేసుకున్నాడు. స్లో గా వేసినా, వేగంగా విసిరినా....టార్గెట్ బౌండరీలైన్ అన్నట్టు బాదేశాడు. సన్నగా కరెంట్ తీగలా సాఫ్ట్‌గా కనిపిస్తూనే, బ్యాట్ పడితే ఎంత వైలైంటో ఫ్యాన్స్‌కి మరోసారి చూపేట్టేశాడు.
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో పవర్ ప్లేలో పరేషాన్ స్టేజ్‌లోకి వచ్చేసిన ఇండియాకి, ఆంధ్రా కుర్రాడు అదిరిపోయే నాటుకోడి పులావ్ వడ్డించాడు. స్లో & స్టడీ గేమ్ ఫార్ములా కాదు...సిక్సర్, సిక్సర్, సిక్సర్ అనే దూకుడితో దుమ్మురేపాడు. 34 బాల్స్‌లో 74రన్స్ సాధించడమే కాదు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అతనాడిన ఇన్నింగ్స్‌లో 58రన్స్ బౌండరీల రూపంలో వచ్చాయంటే, బౌలర్లపై ఎంతలా శివతాండవం చేశాడో అర్థం చేసుకొవచ్చు. స్పెషల్‌గా స్పిన్నర్లను టార్గెట్ చేసిన తీరు, అతని ఆటతీరును, ఆటలోని మజాను, బ్యాట్‌లోని హుషారును, ఆ జోరుతో జోర్థార్ ఇన్నింగ్స్ ఆడేసి హాట్ ప్లేయర్‌గా మారిపోవడమే కాదు రాబోయే రోజుల్లో నితీష్ కుమార్ రెడ్డి స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారిపోయాడు.
Hi, I’m Rebeka Hand, Your Blogging Journey Guide 🖋️. Writing, one blog post at a time, to inspire, inform, and ignite your curiosity. Join me as we explore the world through words and embark on a limitless adventure of knowledge and creativity. Let’s bring your thoughts to life on these digital pages. 🌟 #BloggingAdventures
Leave a comment
Your email address will not be published. Required fields are marked *