రోహిత్ శర్మకు ఆర్సీబీ 20 కోట్లు ఇస్తే..???
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, ఆక్షన్‌లోకి వస్తాడా రాడా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. హార్థిక్ పాండ్యకి కెప్టెన్సీ ఇచ్చి, రోహిత్‌ని అవమాన పర్చారని అతని ఫ్యాన్స్ లాస్ట్ సీజన్‌లో ముంబై ఆడిన చాలా మ్యాచ్‌ల్లో ఓపెన్‌గానే చెప్పారు. హార్థిక్ ఆన్ ద ఫీల్డ్‌లో కనిపించిన ప్రతిసారి వాళ్లు అదే తీరును ప్రదర్శిస్తూ, రోహిత్‌పై మమకారాన్ని చాటుకున్నారు.
� ��ిటెన్షన్ టైమ్ దగ్గర పడుతున్న కొద్ది, రోహిత్ శర్మ, ముంబైతో కొనసాగే విషయంపై హాట్ హాట్ డిబేట్‌కి దారితీస్తున్నాయి. ఇదే కోశ్చన్‌ని టీమిండియా ఆల్‌రౌండ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ని అడిగితే, రోహిత్ ఒకవేళ బయటకి వస్తే, ఆర్సీబీ 20కోట్లు ఇచ్చేలా ప్లాన్స్ చేసుకోవాలన్నాడు. అదే జరిగితే, ఒకే ఐపీఎల్ ఫ్రాంచైజీలో విరాట్ కోహ్లీ, రోహిత్‌ను చూసే చాన్స్ దొరుకుతుందన్నాడు. ఈ స్టేట్‌మెంట్ ఫ్యాన్స్‌ని ఆనందంలో ముంచేస్తున్నాయి. డుప్లెస్సీని రిటెన్షన్ చేసే ఉద్దేశం ఆర్సీబీకి లేదు. అదే టైమ్‌లో వాళ్లకి ఒక కెప్టెన్ కావాలి. కోహ్లీ ఎక్కువగా బ్యాటింగ్‌పైనే ఫోకస్ చేస్తున్నాడు. మరోవైపు, రోహిత్‌కి ముంబైతో సాగే ఇంట్రెస్ట్ లేదనేది ఇంకో కామెంట్. ఇలాంటి ఉహగానాల మధ్య, రోహిత్ ఆక్షన్‌లోకి వచ్చి ఆర్సీబీ దక్కించుకుంటే ఆ టీమ్‌కు తిరుగే ఉండదనేది ఎక్స్‌ఫర్ట్స్ టాక్.
Leave a comment
Your email address will not be published. Required fields are marked *