`

RCB రిటెన్ష‌న్ లిస్ట్‌లో వీళ్ల‌కి నో ఛాన్స్‌?

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ మెగా ఆక్ష‌న్‌కి కౌంట్‌డౌన్ మొద‌ల‌య్యింది. అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు జ‌ట్లు త‌మ రిటెన్ష‌న్ లిస్ట్‌ని రిలీజ్ చేయాల‌ని గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి టైమ్‌లో, ఫ్రాంచైజీలు ఎలాంటి లిస్ట్‌తో వ‌స్తాయ‌ని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ టీమ్‌ల‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ప్లేయ‌ర్ల‌లో ఎవ‌రు ఉంటార‌నేది ఆస‌క్తిని పెంచేస్తుంది.

��ర్సీబీ జ‌ట్టులో చాలా మంది ఆల్‌రౌండ‌ర్లు, మ్యాచ్ విన్న‌ర్లు, ఒక్క ఇన్నింగ్స్‌తో విధ్వంసం సృష్టించే స్టార్స్ ఉన్నారు. వీళ్ల‌లో 5 క‌నిష్టంగా, 6 గ‌రిష్టంగా చాన్స్ ద‌క్కే చాన్స్ ఉంది. ఈ లిస్ట్‌ల‌లో కింగ్ విరాట్ కోహ్లీ, హైద‌రాబాదీ మియా సిరాజ్‌తో పాటు, లాస్ట్ సీజ‌న్‌లో సెంచ‌రీతో స‌త్తాచాటిన విల్ జాక్స్ కి ఫ్రాంచైజీ పెద్ద పీట వేయ‌డం గ్యారెంటీగా క‌నిపిస్తోంది. ఈ ముగ్గురితో పాటు, య‌ష్ ద‌యాల్‌, ర‌జ‌త్ ప‌తిదార్ కూడా రిటెన్ష‌న్ లిస్ట్‌లో స్థానం ద‌క్కించుకోవ‌డం గ్యారెంటీగా క‌నిపిస్తోంది. ఆరో ప్లేయ‌ర్‌ని రైట్ టు మ్యాచ్ కార్డ్ తో ద‌క్కించుకోవాల‌నేది ఆర్సీబీ ప్లాన్‌గా క‌నిపిస్తోంది. ఆ లిస్ట్‌లో కామోరున్ గ్రీన్ పేరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. భ‌విష్య‌త్ దృష్ట్యా గ్లేన్ మ్యాక్స్‌వేల్‌, డుప్లెస్సీ వైపు ఆర్సీబీ దృష్టి పెట్టే చాన్స్ క‌నిపించ‌డం లేదు. సో ఆర్సీబీ ఫ్యాన్స్‌, మీ రిటెన్ష‌న్‌లో ఎవ‌రు ఉన్నారో కామెంట్ రూపంలో చెప్పేసేయండి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *