చిన్న‌స్వామిలో చిన్న‌బోయిన బ్యాట‌ర్లు - 46ర‌న్స్‌కే ఆలౌట‌య్యారు

బెంగ‌ళూరు చిన్న‌స్వామిలో, మ‌న బ్యాట‌ర్లు చిన్న‌బోయారు. టాపార్డ‌ర్ టాప్ లేచిపోతే, మిడిలార్డ‌ర్ మిడిల్‌క్లాస్ ఇన్నింగ్స్ కూడా ఆడ‌లేక‌, డ‌కౌటై, డ‌గౌట్‌కి క్యూ క‌ట్టారు. టాస్ గెల‌వ‌డం త‌ప్ప‌, ఫ‌స్టాఫ్‌లో ఇండియాకి పెద్ద‌గా ఏదీ క‌ల‌సిరాలేదు.