కూకట్‌పల్లి క్లాసెన్‌కి 23కోట్లు..??!!
ఐపీఎల్ ఆక్షన్‌లో ఫ్రాంచైజీలు కోట్లు కురిపించడం మాములుగా మనకి తెలిసిన మ్యాటర్. రీసెంట్‌గా బీసీసీఐ పెట్టిన రూల్స్‌తో వేలం పాటలో ఇలాంటి హెడ్డింగ్‌లు కనిపించవని చాలా మంది నిరుత్సాహానికి గురయ్యారు. కానీ, సన్‌రైజర్స్ హైదరాబాద్, వేలం పాటకి ముందు జరగుతున్న రిటెన్షన్‌తో అందరిని ఒక్కసారిగా షాక్‌కి గురిచేసింది.
� ��ఫారీ వికెట్ కీపర్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి గత రెండు సీజన్లుగా అలరిస్తున్న కూకట్‌పల్లి క్లాసెన్‌కి ఏకంగా 23కోట్లు చెల్లించడానికి సిద్ధమవ్వడం ఇప్పుడు అందరిని ఆసక్తిని పెంచేస్తుంది. బుధవారం సాయంత్రం నుంచి హల్చల్ చేస్తున్న ఈ వార్త చాలా మంది ఫ్యాన్స్‌ని అవాక్కయ్యేలా చేసినా, హెన్రిచ్ క్లాసెన్ లాంటి ప్లేయర్‌ని వదిలేసుకుంటే, టీమ్ ఇరకాటంలో పడటం గ్యారెంటీ అని, వికెట్ కీపర్, బ్యాటర్, అలాగే కెప్టెన్సీ చేయగల సత్తా ఉండటం, గత రెండేళ్లుగా తిరుగులేని ఫామ్‌లో ఉండటంతో క్లాసెన్‌కి 23కోట్లు ఇచ్చేందుకు ఫ్రాంచైజీ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదని ఎక్స్‌ఫర్ట్స్ చెబుతున్నారు. లాస్ట్ సీజన్‌లో క్లాసెన్ 171 స్ట్రయిక్‌రేట్‌తో 479రన్స్ చేశాడు. ఇందులో 38సిక్సర్లు ఉన్నాయి. ఈడెన్ గార్డెన్స్‌తో పాటు, ఉప్పల్ స్టేడియంలో క్లాసెన్ కొట్టిన సిక్సర్లు, అపొజిషన్‌కి చెమటలు పట్టించాయి. మరోవైపు, ఏకంగా తెలుగు అభిమానులు ఈ ప్లేయర్‌కి కటౌట్లు పెట్టి మమకారాన్ని చాటుకున్నారు. అందుకే, కమ్మిన్స్, హెడ్, అభిషేక్ ప్లేయర్స్ కంటే ఎక్కువగా క్లాసెన్‌కి ఇవ్వాలని టీమ్ డిసైడ్ అయ్యింది.
Leave a comment
Your email address will not be published. Required fields are marked *