రిటెన్షన్‌లో ముగ్గురి పేర్లు చెప్పేసిన SRH
ఇండియన్ ప్రీమియర్ లీగ్ రిటెన్షన్‌కి టైమ్ దగ్గర పడుతున్న కొద్ది, ఫ్రాంచైజీల కసరత్తులు ఫ్యాన్స్‌లో ఇంట్రెస్ట్‌తో పాటు, ఆటగాళ్లలో టెన్షన్‌ను మరింత హీటెక్కిస్తున్నాయి. ఇప్పటికే ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ జట్లపై హాట్ హాట్‌గా డిబేట్ జరుగుతున్న వేళ, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ల లిస్ట్ బయటకి రావడం అభిమానుల్లో ఈ ఆక్షన్‌పై, రిటెన్షన్‌పై అమాతం ఆసక్తిని పెంచేసింది.
� ��న్ రైజర్స్ హైదరాబాద్, ఈ సీజన్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించి ఫైనల్ చేరడమే కాదు, ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ని ఓ రేంజ్‌లో సాధించేసి ఈ ఫ్రాంచైజీకి బెస్ట్ సీజన్ ఇదేనని చాటిచెప్పింది. అలాంటి మ్యాజిక్ చేయడంలో కీ రోల్ ప్లే చేసిన పాట్ కమ్మిన్స్‌తో పాటు, కూకట్‌పల్లి క్లాసెన్‌గా ఫ్యాన్స్ మనసులో చెరగని ముద్ర వేసుకున్న సఫారీ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్, ఫాస్టెస్ట్ ఫీఫ్టీ కొట్టడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న అభిషేక్ శర్మ పేర్లను సన్‌రైజర్స్ హైదరాబాద్ కన్ఫార్మ్ చేసింది. ఈ లిస్ట్‌లో క్లాసెన్ 23కోట్లు, కమ్మిన్స్‌కి 18కోట్లు, అభిషేక్ శర్మకి 14కోట్లు ఖరారు చేసింది. వీళ్ల ఇద్దరితో పాటు, టీమ్‌కి హెడ్‌మాస్టర్‌లా మారిన ట్రెవిస్ హెడ్, వైజాగ్ చిన్నోడు నితీశ్ కుమార్ రెడ్డిని కూడా రిటెన్షన్ లిస్ట్‌లో కొనసాగించాలని డిసైడ్ అయ్యింది. ఆరో ఆప్షన్ ఉన్నా....రైట్ టు మ్యాచ్ కార్డ్ ద్వారా ఆ ఒక్క ప్లేయర్‌ను దక్కించుకోవాలని చూస్తోంది. నటరాజన్, భువనేశ్వర్ కుమార్ పేర్లు ఈ లిస్ట్‌లో కనిపిస్తున్నాయి.
Leave a comment
Your email address will not be published. Required fields are marked *