కూక‌ట్‌ప‌ల్లి క్లాసెన్‌కి 23కోట్లు..??!!

ఐపీఎల్ ఆక్ష‌న్‌లో ఫ్రాంచైజీలు కోట్లు కురిపించ‌డం మాములుగా మ‌నకి తెలిసిన మ్యాట‌ర్‌. రీసెంట్‌గా బీసీసీఐ పెట్టిన రూల్స్‌తో వేలం పాట‌లో ఇలాంటి హెడ్డింగ్‌లు క‌నిపించవ‌ని చాలా మంది నిరుత్సాహానికి గుర‌య్యారు. కానీ, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, వేలం పాట‌కి ముందు జ‌ర‌గుతున్న రిటెన్ష‌న్‌తో అంద‌రిని ఒక్క‌సారిగా షాక్‌కి గురిచేసింది.