`

5 ఓవ‌ర్లు, 6 బ్యాట‌ర్లు, ఇదేం లీగ్‌రా బాబోయ్‌..?

ట్రెండ్ మారుతున్న కొద్ది, ట్రెండింగ్‌గా క్రికెట్ మారుతోంది. ఆ మ‌ధ్య ఇంపాక్ట్ ప్లేయ‌ర్ రూల్‌తో బీసీసీఐ క్రికెట్‌ను మ‌రింత ఇంట్రెస్ట్‌గా, డిబేట్‌కి కేరాఫ్‌గా మార్చేస్తే హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ స‌రికొత్త ఫార్ములాతో ఫ్యాన్స్ ముందుకు రాబోతోంది. ఆ మ‌ధ్య T10లీగ్‌తో క్రికెట్‌ను మ‌రింత పొట్టిగా మార్చేయాల‌నుకున్నారు, ఇప్పుడు ఇందులో స‌గంగా హాంకాంగ్ లీగ్ రాబోతుంది.

1 . ఈ టోర్నీలో కేవ‌లం 6గురు ఆట‌గాళ్లు మాత్రమే 2. న‌వంబ‌ర్ 1-3 వ‌ర‌కు హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ 3. ఐదు ఓవ‌ర్ల మ్యాచ్‌...ఫైన‌ల్‌లో 8 ఓవ‌ర్లు 4. ఫీల్డింగ్ సైడ్‌లో వికెట్ కీప‌ర్ కాకుండా, మిగిలిన 5గురు, ఒక్కొ ఓవ‌ర్ బౌలింగ్ చేయాలి 5. వైడ్ & నో బాల్‌కి రెండు ఎక్స్‌ట్రా ప‌రుగులు 6. 5ఓవ‌ర్ల‌లో 5వికెట్లు కోల్పోతే, 6బ్యాట‌ర్‌కి మిగిలిన బాల్స్ ఆడే చాన్స్‌, ఆ టైమ్‌లో ఔటైన బ్యాట‌ర్ ర‌న్న‌ర్‌గా ఉంటాడు. 7. ఒక బ్యాట‌ర్ 31ర‌న్స్ ద‌గ్గ‌రికి చేర‌గానే రిటైర్ నాటౌట్‌, మ‌ళ్లీ బ్యాటింగ్‌కి రావాలంటే ఐదు వికెట్లు ప‌డాల్సిందే 8. ప్ర‌తి విక్ట‌రీకి 2 పాయింట్లు, రెండు గ్రూపుల్లో టాప్ ప్లేస్‌లో ఉండే జ‌ట్లు సెమీస్ ఆడుతాయి. అందులోంచి రెండు టీమ్స్ ఫైన‌ల్‌కి చేరుతాయి. ఈ ఇంట్రెస్టింగ్ హాంకాంగ్ సిరీస్ టోర్న‌మెంట్‌ని స్టార్ స్పోర్ట్స్ టెలికాస్ట్ చేస్తుంటే, సురేష్ రైనా ఇండియా టీమ్‌కి కెప్టెన్‌గా ఉన్నాడు. మ‌రీ, ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న టోర్నీ ఎలాంటి రిజ‌ల్ట్స్ తీసుకొస్తుంద‌నేది ఇంట్రెస్టింగ్‌ను పెంచుతోంది.

Krishna Veni

Leave a comment

Your email address will not be published. Required fields are marked *